అరెస్టులతో విద్యార్థుల గొంతు నొక్కలేరు.. జగన్ సర్కార్‌పై లోకేశ్ సీరియస్..!

Friday, January 29th, 2021, 12:00:08 AM IST

Nara-Lokesh

జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ప్రైవేట్ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసి బడుగు, బలహీన వర్గాల విద్యార్థులను జగన్ ఉన్నత విద్యకు దూరం చేసాడని ఆరోపించారు. విద్యార్థుల భవిష్యత్తుకి శరాఘాతంగా మారిన జిఓ 77ని రద్దు చెయ్యమని డిమాండ్ చేసినందుకు మండిపడ్డారు.

అయితే అక్రమ కేసులు పెట్టి టిఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అరెస్ట్ చేసారు. అరెస్టులతో విద్యార్థుల గొంతు నొక్కలేరని, విద్యార్థులకు అన్యాయం చేస్తే ఊరుకోం అంటూ ఉద్యమిస్తున్న టిఎన్ఎస్ఎఫ్ నాయకుల్ని అభినందిస్తున్నాను వైకాపా ప్రభుత్వం జిఓ 77ని వెంటనే ఉపసంహరించుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని లోకేశ్ హెచ్చరించారు.