జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి దళిత జాతి ఏకం అవ్వాలి – నారా లోకేశ్

Thursday, January 21st, 2021, 10:09:17 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జగన్ పాలనలో దళితులపై దమనకాండ కొనసాగుతూనే ఉందని, మాస్క్ పెట్టుకోలేదని చీరాల పోలీస్ స్టేషన్ లో దళిత యువకుడు కిరణ్ ని కొట్టి చంపారు. 7 నెలలు అయినా ఆ కుటుంబానికి న్యాయం జరగలేదని, హత్య చేసిన పోలీసులకు శిక్ష పడలేదని లోకేశ్ అన్నారు.

అయితే వైకాపా నాయకుడి బంధువు అనే కారణంతో ఎస్సై ని కాపాడే ప్రయత్నం చెయ్యడం దారుణమని, కిరణ్ కి జరిగిన అన్యాయం మరే కుటుంబానికి జరగడానికి వీలు లేదని, అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచకం సృష్టిస్తున్న జగన్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి దళిత జాతి ఏకం అవ్వాలని కోరారు. అంతేకాదు కిరణ్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ప్రత్యక్ష, న్యాయ పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.