మీ గాలి మాటలతో రైతుల ఇంట పండుగ వాతావరణం రాదు – నారా లోకేశ్

Tuesday, January 12th, 2021, 08:49:04 PM IST

Nara Lokesh

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సంక్రాంతి పండుగ ముందే వచ్చింది అంటూ జగన్‌కి పబ్లిసిటీ పిచ్చ తప్ప రైతుల ఇంట పండుగ వాతావరణం లేదని అన్నారు. వరదలు, తుఫాన్ల దెబ్బకి దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారని అరకొరగా పండిన పంటని అమ్మి రెండు నెలలు అవుతున్నా ధాన్యం బకాయిలు విడుదలకాలేదని అన్నారు.

దీంతో రైతులు కంట కన్నీరు పెట్టి రోడ్డెక్కి ఆందోళన చెయ్యాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడిందని అన్నారు. నిండా మునిగిన కౌలు రైతులు కనీస సహాయం అందక అనేక ఇబ్బందులు పడుతున్నారు. మీ గాలి మాటలతో రైతుల ఇంట పండుగ వాతావరణం రాదు. ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.2788 కోట్లను వెంటనే రైతులకు చెల్లించండి జగన్ రెడ్డి గారు అని నారా లోకేశ్ డిమాండ్ చేశారు.