మీ పిల్లలకు మాత్రమే విదేశీ విద్యనా.. జగన్‌పై మండిపడ్డ నారా లోకేశ్..!

Monday, January 11th, 2021, 08:30:48 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. మీ పిల్లలకు మాత్రమే విదేశీ విద్యనా? బడుగు బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్య, విదేశీ విద్యకు అర్హులు కారా జగన్ గారు అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చారు. విద్యార్థుల భవిష్యత్తుని అంధకారం చేసారని మండిపడ్డారు.

ఒక మైనార్టీ మహిళ తన కుమార్తెను విదేశాల్లో చదివించాలని కల కనడం తప్పా? కూతురు విదేశీ విద్యకు ప్రభుత్వ సహాయం అందించాలని కలవని నాయకుడు లేడు, పెట్టని అర్జీ లేదు. స్పందన కరువవ్వడంతో హిందూపురం నుండి అమరావతికి ఒంటరిగా 750 కిమీ నిరాహార యాత్ర చేసారు ముక్బుల్ జాన్ అంటూ ఆమె ఆవేదంతో మాట్లాడిన వీడియోను నారా లోకేశ్ పోస్ట్ చేశారు. సహాయం అందించని ప్రభుత్వం పోలీసులను పంపి ఆమె యాత్రని అడ్డుకొని అనేక ఇబ్బందులు పెట్టారు. ఆమె ఆవేదన వింటే జగన్ రెడ్డిది ఎంత చెత్త పరిపాలనో కళ్ళకు కట్టినట్లు అర్ధమవుతుందని అన్నారు.