రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది.. నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్..!

Monday, January 4th, 2021, 08:25:10 PM IST

గుంటూరు జిల్లాలోని దాచేపల్లి మండలం పెదగార్లపాడులో టీడీపీ నేత పురంశెట్టి అంకులు నిన్న దారుణ హత్యకు గురయ్యారు. అయితే నేడు పురంశెట్టి అంకులు కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఓ ఫ్యాక్షన్ నాయకుడు సీఎం అయితే ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలు ఇప్పుడు కళ్ళారా చూస్తున్నారని అన్నారు.

అయితే కాపునేత అంకులను కాసు మహేశ్ రెడ్డి, దాచేపల్లి ఎస్‌ఐ కలిసే చేయించారనే విషయం ప్రజలందరికీ తెలుసని, కానీ దాచేపల్లి ఎస్‌ఐ పేరు ఎందుకు ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదని నిలదీశారు. రాష్ట్రంలో ఎవరికి రక్షణ లేకుండా పోయిందని, రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. ఇకనైనా ఫ్యాక్షన్ రాజకీయాలకు ఫుల్‌స్టాఫ్ పెట్టాలని, ఇంకో కార్యకర్త జోలికి వస్తే జరగబోయే పరిణామాలకు జగన్ రెడ్డే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.