లారీలు కాదు జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా చంద్రబాబును అడ్డుకోలేరు – నారా లోకేశ్

Saturday, January 2nd, 2021, 04:50:42 PM IST

Lokesh

రామతీర్థంలో రాముడి విగ్రహం ధ్వంసం ఘటనను నిరసిస్తూ నేడు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు రామతీర్ధాన్ని సందర్శించేందుకు వెళ్లారు. అయితే చంద్రబాబు రామతీర్థం పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లారీలు కాదు జగన్ రెడ్డే అడ్డంగా పడుకున్నా చంద్రబాబు గారి రామతీర్థం పర్యటనను అడ్డుకోలేడని అన్నారు.

హిందూ ధర్మంపై జరుగుతున్న దాడిని అడ్డుకోలేని జగన్, విగ్రహాల ధ్వంసాన్ని అడ్డుకోలేని పోలీసులు కలిసి చంద్రబాబు గారి పర్యటనను అడ్డుకోవడానికి లారీలు అడ్డంగా పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని, ప్రతిపక్ష నేత బయటకి వెళ్లకుండా గేటుకి తాళ్ళు కడతారని, ఇప్పుడు ఏకంగా లారీలు అడ్డంగా పెట్టారని అన్నారు. ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగానికి అడ్డు, అదుపు లేదని అన్నారు.