వైసీపీ పాలనలో రైతు ఆత్మహత్యలు పెరిగిపోయాయి – నారా లోకేశ్

Monday, December 28th, 2020, 10:34:26 PM IST

Nara Lokesh

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని, జగన్ సీఎం అయిన 579 రోజుల్లో 767 మంది ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు చేశారు. వరుస విపత్తులు వస్తే సమగ్ర నష్టం అంచనా ఎక్కడా చేయట్లేదని, ఓ పక్క రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, వ్యవసాయ మంత్రి రికార్డింగ్ డ్యాన్సుల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు.

అంతేకాదు దున్నపోతును ముళ్ల కర్రతో పొడిచినట్లు, రైతులు కూడా ప్రభుత్వాన్ని పొడవటానికి సిద్ధంగా ఉన్నారని, ప్రభుత్వం రైతులను ఆదుకోకుంటే వచ్చే ఆరు నెలల్లో ఇంకా ఆత్మహత్యలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకిచ్చిన హామీలను సీఎం జగన్ తుంగలో తొక్కారని అన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని అన్నారు.