ఎన్నికల ముందు కూతలు.. అధికారం వచ్చాక కోతలు – నారా లోకేశ్

Sunday, December 27th, 2020, 01:11:35 PM IST

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. మీ పిల్లలకు మాత్రమే ఫారెన్ చదువులా అని బడుగు, బలహీన వర్గాల యువత విదేశాల్లో చదువుకోవడానికి అర్హులు కారా జగన్ గారు అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ విదేశీ విద్య పథకాన్ని నిర్వీర్యం చేసారని, ఎన్నికల ముందు కూతలు అధికారం వచ్చాకా కోతలు అని ఎద్దేవా చేశారు.

ఇప్పుడు ఏకంగా ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని వైకాపా ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నానని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడం మంచిది కాదు జగన్ రెడ్డి గారు అని లోకేశ్ సూచించారు. ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని రద్దు చేస్తూ ఇచ్చిన జీఓని వెనక్కి తీసుకోవాలి.ప్రైవేట్‌ కాలేజీల్లో చదివే పీజీ చదివే విద్యార్థులందరికీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.