జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేదు.. నారా లోకేశ్ సీరియస్..!

Friday, December 18th, 2020, 06:35:38 PM IST

Lokesh

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. జగన్ పాలనలో ప్రజలకు రక్షణ లేదని ఆరోపించారు. అనపర్తి నియోజకవర్గంలో డాక్టర్‌గా ప్రాణాలు కాపాడాల్సిన ఒక ఎమ్మెల్యే, వేధింపులకు గురిచేసి మహిళను బలితీసుకున్నారని అన్నారు. తాను పంచిన 2 వేలు తీసుకోకుండా వైకాపాకి ఓటేసినందుకు, వాళ్ళు ఇంటికి వెళ్లే దారి మూయించి వేధిస్తున్నారని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నా అని లేఖ రాసి అరుణకుమారి గారు ఆత్మహత్య చేసుకున్నారు.

అయితే ఈ ఈ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని, వైకాపా నాయకులు రాక్షసుల్లా మారి ప్రజల్ని మింగేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటన పై పూర్తి విచారణ జరిపి మహిళ ఆత్మహత్యకు కారణమైన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.