ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని అరాచ‌క ప్ర‌దేశ్‌గా మార్చేశారు.. నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్..!

Friday, December 11th, 2020, 05:45:27 PM IST

Lokesh

ఏపీ టీడీపీ నేతలు న‌ల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, శంక‌ర్‌యాద‌వ్‌లపై వైసీపీ కార్యకర్తలు చేసిన దోపీడీని ఖండించిన టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ జంగిల్ రాజ్యంలో ప్రజలకు, ప్ర‌తిప‌క్షనేత‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయిందని, చ‌నిపోయిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను ప‌రామ‌ర్శించేందుకు న‌ల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, శంక‌ర్‌యాద‌వ్‌లు వెళ్తుండ‌గా వైకాపా కార్య‌క‌ర్త‌లు కాన్వాయ్‌పై దాడి చేశారని అన్నారు.

అయితే ఈ దాడి జరుగుతున్నా పోలీసులు ప్రేక్ష‌క‌పాత్ర వ‌హించ‌‌డం చూస్తుంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ని అరాచ‌క ప్ర‌దేశ్‌గా మార్చేశార‌ని అర్థమ‌వుతోందని, ఫ్యాన్ గుర్తు అధినేత నుంచి కార్య‌క‌ర్త వ‌ర‌కూ అంద‌రూ ఫ్యాక్ష‌న్ మ‌న‌స్త‌త్వం వున్న‌వారేనని వ్యాఖ్యానించారు. అయినా పోలీసుల‌కేమైందని, ప్రజల సొమ్ముని జీతంగా తీసుకుని వైకాపా కోసం ప‌నిచేయ‌డం సిగ్గుచేటు అని మీరు ప్ర‌జార‌క్ష‌క‌భ‌టులా? ప్రజలపై క‌క్ష‌క‌ట్టిన భటులా అని ప్రశ్నించారు.