టార్చర్ చేసి సలాం కుటుంబాన్ని మింగేసారు.. జగన్ సర్కార్‌పై నారా లోకేశ్ సీరియస్..!

Wednesday, November 11th, 2020, 06:05:59 PM IST

Lokesh

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ జగన్ సర్కార్ తీరుపై మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. టార్చర్ చేసి సలాం కుటుంబాన్ని మింగేసారని, అయినా జగన్ ప్రభుత్వానికి రక్త దాహం తీరలేదని మండిపడ్డారు. రాత్రి పూట సలాం కుటుంబ సభ్యుల ఇంటికి పోలీసుల్ని పంపి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టాలని ఒత్తిడి చేస్తున్నారని అన్నారు.

ఒక మైనార్టీ కుటుంబానికి ఇన్ని వేధింపులా? కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వారిని హింసించడం జగన్ రెడ్డి రాక్షస మనస్తత్వానికి పరాకాష్ట అని బెదిరించి, సాక్ష్యాలు తారుమారు చేసి దోషులను కాపాడే కుట్ర జరుగుతోందని లోకేశ్ ఆరోపించారు. ఈ కేసుని సీబీఐకి అప్పగించి బాధిత కుటుంబానికి న్యాయం చెయ్యాలని, సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.