దొంగ పేపర్ అమ్ముకోవడానికి ప్రజల సొమ్ము మింగడం ఏంటి – నారా లోకేశ్

Sunday, October 18th, 2020, 10:00:56 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అన్న క్యాంటీన్లు ప్రభుత్వానికి అదనపు భారం అంటూ పేదవాడి నోటి దగ్గర కూడు లాక్కున్న మీరు దొంగ పేపర్ అమ్ముకోవడానికి ప్రజల సొమ్ము మింగడం ఏంటి జగన్ గారు అంటూ ప్రశ్నించారు.

అయితే ఒక పక్క ప్రకటనల పేరుతో వందల కోట్ల దోపిడీ. ఇప్పుడు ఏకంగా గ్రామ, వార్డు సచివాలయాలలో మీ అవినీతి కరపత్రిక పేరుతో ఐదున్నర కోట్లు కొట్టేస్తున్నారు. ప్రజలు సా”ఛీ” అనడంతో అడ్డదారుల్లో సర్క్యూలేషన్ పెంచడానికి నానా తంటాలు పడుతున్నారు. ఎంత పెంచినా దొంగ పత్రిక జన్మ రహస్యమైన అవినీతి కంపు పోతుందా అని ఎద్దేవా చేశారు.