బురద రాజకీయం మానుకోండి.. వైకాపా నేతలపై లోకేశ్ సీరియస్..!

Wednesday, September 30th, 2020, 06:23:13 PM IST

ఏపీలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించి ప్రజలకు, రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. అయితే దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డారు. వైకాపా నాయకులు బురద రాజకీయం మాని ముందు వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.

లంక గ్రామాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని, రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కంద, పసుపు, ప్రత్తి, మినుము, అరటి, మిర్చి రైతులు కన్నీరు పెడుతున్నారని, జగన్ గారు చెబుతున్న నష్ట పరిహార అంచనా, నష్ట పరిహారం కేవలం పత్రికల్లో తప్ప క్షేత్ర స్థాయిలో కనపడటం లేదని, త్వరితగతిన అంచనా నివేదికలు పూర్తి చేసి రైతులకు పరిహారం అందించాలని లోకేశ్ డిమాండ్ చేశారు.