జగన్ గారు చెప్తున్నవన్ని గాలి మాటలే.. నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్..!

Tuesday, September 15th, 2020, 12:50:40 PM IST

Lokesh

ఏపీలో ప్రస్తుతం రైతుల పరిస్థితి దారుణంగా ఉందని టీడీపీ నేత నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, రైతుల్ని దళారులు నిలువు దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోందని అన్నారు. పండించిన పంటలకు మద్దతు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, పుట్టి ధాన్యానికి రూ.8 వేలు ధర కూడా లభించడం లేదని అన్నారు.

అయితే పుట్టి ధాన్యానికి రూ.16వేల కనీస మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని జగన్ గారు చెప్తున్న గాలిమాటలు తప్ప, క్షేత్ర స్థాయిలో రైతాంగాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రైతుల కష్టాలను చూసి వారిని ఆదుకోవాలని కోరారు.