వైకాపా గూండాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు – నారా లోకేశ్

Sunday, September 6th, 2020, 03:15:14 AM IST


ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాడులు పెరిగిపోతున్నాయని ముందు నుంచి టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా కర్నూల్ జిల్లాలో జరిగిన ఓ ఘటనపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు.

జగన్ గారి దౌర్జన్యకాండ కొనసాగుతోందని, వైకాపా గూండాలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారని అన్నారు. కర్నూలు జిల్లా మండిగిరిలో వైసీపీ నేత కల్లుబోతు సురేష్ గ్రామ సచివాలయ ఉద్యోగులపై దుర్భాషలాడుతూ, భౌతికదాడి చేసాడని, చెప్పిన పని చెయ్యలేదని ప్రభుత్వ ఉద్యోగి చెంప పగలకొట్టడానికి ఎంత దైర్యం అని ప్రశ్నించారు. అధికార మదంతో వైకాపా నాయకుల కళ్ళు నెత్తికెక్కాయని, ఏఓపై దాడి చేసిన వైకాపా నేతని కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ ఉద్యోగులకు రక్షణ కల్పించాలని కోరారు.