వైఎస్ జగన్ రౌడీ రాజ్యంలో అరాచకం రాజ్యమేలుతోంది – నారా లోకేశ్

Friday, September 4th, 2020, 03:45:25 PM IST

Lokesh

జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జగన్ రౌడీ రాజ్యంలో అరాచకం రాజ్యమేలుతోందని, రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని అన్నారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలంలో వైసీపీ శ్రేణులు మరోసారి రెచ్చిపోయారని వైసీపీ పాలనలో అసలు ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు.

వల్లభాపురంలో దిలీప్ రెడ్డి అనే యువకుడిపై వైసీపీ శ్రేణులు ఇంటికెళ్లి కర్రలతో దాడి చేసారని, అడ్డుకోబోయిన దిలీప్ రెడ్డి తండ్రి, బాబాయ్ లపై కూడా కర్రలలో విచక్షణ రహితంగా దాడి చేశారని మండిపడ్డారు. అయితే వైకాపా గూండాలు గ్రామాల్లో దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని, దిలీప్ రెడ్డి కుటుంబంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.