ఇచ్చిన ప్రతీ హామీలో మోసం.. జగన్ సర్కార్‌పై నారా లోకేశ్ మండిపాటు..!

Wednesday, September 2nd, 2020, 02:02:48 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. రైతే రాజు అనే రోజు తీసుకొస్తా అని చెప్పిన జగన్ అసలు రైతే లేని రోజు తీసుకొస్తున్నారని అన్నారు. వివిధ పథకాల ద్వారా రైతుకి ఏడాదిలో లక్ష రూపాయిల లబ్ది అన్నారని, ఆఖరికి విత్తనాలు, ఎరువులు కూడా ఇవ్వలేక ఈ అసమర్థ వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసిందని మండిపడ్డారు.

అంతేకాదు జగన్ ఇచ్చిన ప్రతీ హామీలో మోసం ఉందని, ఏకంగా ఉచిత విద్యుత్ పథకానికే మంగళం పాడే ప్రక్రియ మొదలుపెట్టారని అన్నారు. 15 నెలల్లో జగన్ రెడ్డి గారి రైతు వ్యతిరేక నిర్ణయాల వలనే ఆత్మహత్యలు భారీ స్థాయిలో పెరిగాయని అన్నదాతల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉందని, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందని ఇకనైనా పబ్లిసిటీ పిచ్చిని పక్కన పెట్టి రైతన్నలను కాపాడండని ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని విన్నవించారు.