రాష్ట్రంలో జగన్ రౌడీ రాజ్యం నడుస్తుంది.. నారా లోకేశ్ సీరియస్..!

Saturday, August 29th, 2020, 04:30:10 PM IST

ఏపీలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. రాష్ట్రంలో జగన్ రౌడీ రాజ్యం నడుస్తుందని, రోజుకో దళితుడిపై దాడి చెయ్యందే వైకాపా నాయకులకు నిద్ర పట్టడం లేదని అన్నారు.

అయితే అనంతపురం జిల్లా, యాడికి మండలంలో రోడ్డు మరమత్తు పని చేస్తున్న దళితుడైన రాజు, ఇంజినీర్ పఠాన్ జమీర్ పై వైకాపా నాయకుడు రమేష్ అమానుషంగా దాడి చేసి దుర్భాషలాడాడని ఓ వీడియోను పోస్ట్ చేశాడు. శిరోముండనం, చంపడం, వేధింపులు, దాడులకు పాల్పడుతూ దళితులపై దమనకాండ కొనసాగిస్తున్నారు జగన్ రెడ్డి గారు అని దళితులపై దాడులకు దిగుతున్న వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.