ఓటేసిన వారినే కాటేస్తున్నారు.. జగన్ సర్కార్‌పై లోకేశ్ సీరియస్..!

Wednesday, August 26th, 2020, 01:35:49 PM IST

జగన్ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ ద్వారా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఓటేసిన వారినే కాటేస్తున్నారని, జగన్ మద్యపాన నిషేధం పేరుతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటున్న తీరుని సోషల్ మీడియాలో ఎండగట్టినందుకు దళిత యువకుడు ఓం ప్రతాప్ ని బలితీసుకున్నారని అన్నారు.

చంపేస్తాం అంటూ వైకాపా నాయకుల బెదిరింపులు, పోలీసుల వేధింపుల కారణంగానే చిత్తూరు జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, సోమాల మండలం, కందూరు గ్రామంలో ఓం ప్రతాప్ చనిపోయాడు. ఓం ప్రతాప్ మృతి పై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న వైకాపా ముఖ్యనాయకులను కఠినంగా శిక్షించాలని, దళితులకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదా అని ప్రశ్నించారు. అంతేకాదు దళితులపై జగన్ రెడ్డి ప్రభుత్వ దాష్టికాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపాడు.