అది మీ తరం కాదు.. వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్ సీరియస్..!

Friday, August 21st, 2020, 06:29:00 PM IST

Nara_Lokesh

ఏపీలో స్వర్గీయ ఎన్‌టీఆర్ విగ్రహాలను ద్వంసం చేస్తున్న ఘటనలు ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్నాయి. అయితే తాజాగా గుంటూరు జిల్లా తెనాలిలో మరో ఘటన చోటు చేసుకుంది. దీనిపై స్పందించిన నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. కూలగొడితే కూలిపోవడానికి, ధ్వంసంచేస్తే ధ్వంసమైపోవడానికి ఆయన విగ్రహం కాదు ప్రజల మనస్సులో కొలువైన దైవం అని అన్నారు.

స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు గారి విగ్రహాలు లేకుండా చెయ్యడం ద్వారా ప్రజలకు ఆయన్ని దూరం చెయ్యగలమని సైకో మనస్తత్వంతో జగన్ గారు, వైకాపా నాయకులు అనుకుంటున్నారని, అది మీ తరం కాదని అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేసి రాక్షస ఆనందం పొందిన వారిని అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు.