ఇదెక్కడి న్యాయం.. జగన్ సర్కార్‌ని నిలదీసిన నారా లోకేశ్..!

Sunday, August 16th, 2020, 10:30:23 PM IST

Nara-Lokesh

వైసీపీ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీరీయస్ అయ్యారు. ఎంతో మందికి విద్య‌, విజ్ఞానాలు అందించి, క‌ళ‌లు, సంస్కృతిని పెంపొందించిన‌ విజ‌య‌న‌గ‌రం పూస‌పాటి వంశీయుల మ‌హారాజ పోష‌ణా సంస్థ మాన్సాస్‌. అటువంటి సంస్థని జగన్ స‌ర్కారు త‌మ కుతంత్ర రాజ‌కీయాల‌కు వేదిక చేసుకోవ‌డం విచార‌క‌రమంటూ ఓ వీడియోను ట్వీట్ చేశాడు.

అయితే అశోక్ గ‌జ‌ప‌తిరాజుని చైర్మ‌న్‌గా జ‌గ‌న్‌రెడ్డి తొల‌గించిన నుంచీ ఈ సంస్థ‌ల‌లో ప‌నిచేసే ఉద్యోగులకు జీతాలివ్వ‌డంలేదు. 5 నెల‌లుగా జీతాలివ్వ‌డంలేద‌ని నాన్‌టీచింగ్ స్టాఫ్ విజ‌య‌న‌గ‌రం వీధుల్లో భిక్షాట‌న చేయ‌డం అంద‌రినీ క‌ల‌చివేస్తోందని అన్నారు. అయితే వారందరు కుటుంబాల‌తో స‌హా రోడ్డున ప‌డటానికి కార‌ణం ముమ్మాటికీ జ‌గ‌న్‌రెడ్డి స‌ర్కారే అని భూములు కొట్టేసేందుకు, ప‌ద‌వులు అలంక‌రించేందుకు మాన్సాస్ ట్ర‌స్ట్ కావాలా? అందులో ప‌నిచేసే ఉద్యోగుల‌కు మాత్రం జీతాలివ్వ‌రా! ఇదేమి న్యాయం అంటూ ప్రశ్నించారు.