ఇవన్ని సర్కార్ హత్యలే.. జగన్ సర్కార్‌పై నారా లోకేశ్ మండిపాటు..!

Monday, August 3rd, 2020, 01:50:19 PM IST

ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఇటీవల మద్యం దొరకక శానిటైజర్ తాగి దాదాపు పది మంది మృత్యువాత పడగా తాజాగా కడపలొ కూడా ముగ్గురు ఇదే విధంగా మృతిచెందారు. అయితే దీనిపై స్పందించిన నారా లోకేశ్ జగన్ ధనదాహానికి ప్రజలు బలైపోతున్నారని, ప్రకాశంలో 20 మంది, కడపలో ముగ్గురు నాటు సారా, శానిటైజర్ తాగి మృతి చెందటం బాధాకరమని, ఇవన్నీ సర్కారు హత్యలే అని అన్నారు.

జే టాక్స్ వసూళ్ల కోసం లోపభూయిష్టమైన మద్యం పాలసీ తీసుకొచ్చారని, చెత్త బ్రాండ్లు తెచ్చి ప్రజల రక్తాన్ని తాగుతూ 25వేల కోట్లు దండుకుంటున్నారని అన్నారు. నాటు సారా ఏరులై పారుతోందని, జే బ్రాండ్లు తాగిన వాళ్ళు ఆసుపత్రికి చేరుతున్నారు. ఇప్పటికైనా జగన్ గారు మద్యనిషేధం పేరుతో దందా చెయ్యడం మాని ప్రజల ప్రాణాలు కాపాడాలని అన్నారు.