అలాంటి నీచస్థితికి జగన్ దిగజారిపోయారు.. నారా లోకేశ్ సీరియస్ కామెంట్స్..!

Saturday, August 8th, 2020, 12:51:40 AM IST

Nara_Lokesh
వైసీపీ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ మరోమారు మండిపడ్డారు. నేర స్వభావం ఉన్న జగన్ లాంటి వ్యక్తి చేతిలో అధికారం ఉంటే ఎంత ప్రమాదమో చూస్తున్నాం అని కరోనాని కూడా కక్ష సాధింపు కోసం వాడుకునే నీచ స్థితికి జగన్ దిగజారిపోయారని అన్నారు.

కరోనా పేరుతో జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డిలను మళ్ళీ అరెస్ట్ చేసారని, అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోపే మళ్ళీ జైల్లో పెట్టా అని జగన్ సైకో ఆనందం పొందుతున్నారని, కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ధ ప్రజలపై పెట్టి ఉంటే ఈ రోజు ప్రజలకు ఇన్ని కష్టాలు ఉండేవి కావని అన్నారు.