ఐదు కోట్ల‌ ఆంధ్రుల‌కు జగన్ స‌మాధానం చెప్పి తీరాలి – నారా లోకేశ్

Thursday, August 6th, 2020, 04:00:43 PM IST

Nara_Lokesh

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జగన్ గారూ స్థానిక యువ‌త‌కు ఉపాధి క‌ల్ప‌న‌, సెల్ఫ్ ఫైనాన్స్ కేపిట‌ల్‌, గార్డెన్ సిటీ, లంగ్‌స్పేస్ తో ప్ర‌పంచానికే త‌ల‌మానికంగా న‌వ్యాంధ్ర‌కు రాజ‌ధానిగా మ‌‌హాన‌గ‌రం క‌డ‌తాన‌ని ఉత్త‌ర‌కుమార ప్ర‌గ‌ల్భాలు పలికారని అన్నారు.

అయితే నువ్వేమైతే చెప్పావో వాటికంటే ఘ‌న‌మైన ల‌క్ష్యాల‌తో చంద్ర‌బాబు గారు నిర్మించిన అమ‌రావ‌తి ప్ర‌జారాజ‌ధానిని ఎందుకు ధ్వంసం చేయాల‌నుకుంటున్నారో ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలని, మీరు క‌ట్టాల‌నుకున్న‌ రాజ‌ధాని కంటే గొప్ప‌ది చంద్రబాబు క‌ట్టారని కూల‌గొడుతున్నారా అని ప్రశ్నించారు. అమ‌రావ‌తి నిర్మాత‌గా చంద్ర‌బాబు గారి పేరు చ‌రిత్ర‌లో ఉండ‌కూడ‌ద‌ని మూడు ముక్క‌లాట‌తో విధ్వంసం సృష్టిస్తున్నారా అని ఐదు కోట్ల‌ ఆంధ్రుల‌కు స‌మాధానం చెప్పి తీరాలని అన్నారు.