సొంత బ్రాండ్లపై ఉన్న ఆరాటం.. ప్రజల ఆరోగ్యంపై లేదు – నారా లోకేశ్

Saturday, May 8th, 2021, 06:04:13 PM IST


ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. జగన్‌కి త‌న సొంత బ్రాండ్ల మ‌ద్యం అమ్మ‌కం పై ఉన్న ఆరాటం.. ప్రజల ఆరోగ్యంపై లేక‌పోవ‌డం విచార‌క‌రమని అన్నారు. తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం వ‌చ్చే మ‌ద్యంషాపుల ముందు మందుబాబుల‌ను పోలీసుల సమక్షంలో జాగ్ర‌త్త‌గా క్యూలలో పెట్టి, భౌతికదూరం పాటించేల చూస్తున్నారని అన్నారు.

అయితే క‌రోనా నుంచి ర‌క్షించే వ్యాక్సిన్ వేయించుకునేందుకు వ‌చ్చిన జ‌నానికి మాత్రం వ్యాక్సిన్ అందించ‌క‌ దొమ్మీకి వ‌దిలేసి కోవిడ్‌ వ్యాప్తికి మరింత కార‌ణం అవుతున్నారని మండిపడ్డారు. దీనికి సంబంధించి జగన్ సొంత బ్రాండ్ల మద్యం అమ్మకానికి క్యూ అని, జనం ఆరోగ్యానికి వేసే వ్యాక్సిన్‌కి తోపులాట అంటూ ఓ వీడియోను కూడా నారా లోకేశ్ పోస్ట్ చేశాడు.