పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ తొక్కని అడ్డదారులు లేవు – నారా లోకేశ్

Tuesday, February 23rd, 2021, 06:00:39 PM IST

వైసీపీ సర్కార్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ వేదికగా మరోసారి మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ తొక్కని అడ్డదారులు లేవని, అధికార మదంతో అరాచకాలు సృష్టించారని అన్నారు. అంతేకాదు అర్ధరాత్రి అధికారులను ప్రలోభాలకు గురిచేసి విజయాన్ని తమ ఖాతాలో వేసుకున్నారని ఆరోపించారు.

విజయనగరం జిల్లా, కొత్తవలస గ్రామ పంచాయతీలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి 260 ఓట్ల గెలిచినా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒత్తిడితో వైకాపా గెలిచినట్టు ప్రకటించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసారు కొంతమంది అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం అని, చీకటి మాటున గెలిచాం అని ప్రకటించుకున్నా పగలు ధైర్యంగా జనాల్లో తిరగలేని పరిస్థితి వైకాపా నాయకులదని, తప్పుడు పనులు చేసి అధికార పార్టీకి తొత్తులుగా మారిన కొంతమంది అధికారులపై ఎస్ఈసి చర్యలు తీసుకోవాలి. ఆధారాలు పరిశీలించి రీ-కౌంటింగ్ కి ఆదేశించాలని డిమాండ్ చేశారు.