అందుకే నిన్ను ఫేక్ సీఎం అనేది.. జగన్‌పై నారా లోకేశ్ సీరియస్..!

Friday, December 25th, 2020, 11:54:52 AM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. నేడు సీఎం జగన్ ఇళ్ల పట్టాల పంపిణీకి శ్రీకారం చుడుతుండడంపై స్పందించిన లోకేశ్ పేదలకది సెంటు స్థలం కానీ జగన్కి, వైకాపా ఎమ్మెల్యేలకు అది కుంభస్థలం అని స్థల సేకరణ లో అవినీతి, చదును పేరుతో దోపిడీ, పంపిణీ పేరుతో పేదల రక్తాన్ని జలగల్లా పీల్చడం. మొత్తంగా పేదల పేరుతో జగన్ రెడ్డి త్రీ ఇన్ వన్ స్కాం విలువ 6,500 కోట్లు అని అన్నారు.

టీడీపీ హయాంలో కట్టిన నాణ్యమైన ఇళ్లకు బులుగు రంగు వేసినంత మాత్రానా సైకిల్ బ్రాండ్ చేరిగిపోదని, నీ కోటలోని మరుగుదొడ్డి కంటే తక్కువుగా కొండలు, గుట్టలు, శ్మశానాల్లో, చెరువుల్లో ఇచ్చే స్థలంలో పేదలు ఉండే పరిస్థితి లేదని అన్నారు, ఇప్పుడున్న ఆధారాలతో జగనన్న జైలు పిలుస్తోంది పథకంలో భాగంగా 41 మంది వైకాపా ఎమ్మెల్యేలు జైలులో జగన్ రెడ్డితో పాటు చిప్పకూడు తినడం ఖాయమని, ఇప్పటి వరకూ టీడీపీ కేసుల వలనే స్థలం ఇవ్వలేక పోతున్నాం అన్నావ్. మరి ఇప్పుడెలా ఇస్తున్నావ్ జగన్ రెడ్డి, అందుకే నిన్ను ఫేక్ సీఎం అనేది అని లోకేశ్ కామెంట్స్ చేశారు.