అమరావతితో మూర్ఖుడు ఆటలాడుతున్నాడు.. జగన్‌పై లోకేశ్ సీరియస్..!

Wednesday, December 16th, 2020, 11:00:09 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అమరావతి రాష్ట్ర ప్రజల ఎమోషన్, ప్రజల ఎమోషన్‌ని టచ్ చేస్తే ఎంతటి వారైనా మసే అని, చరిత్రలో తన కంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అమరావతితో మూర్ఖుడు జగన్ ఆటలాడుతున్నాడని అన్నారు.

అమరావతి గొప్పతనాన్ని ఎంతో చక్కగా వివరిస్తూ టీడీపీ సాంస్కృతిక శాఖ అధ్యక్షుడు నరసింహ ప్రసాద్ గారు రూపొందించిన పాట విన్న తరువాత అమరావతిపై గౌరవం మరింత పెరుగుతుందని అన్నాడు. అమరావతి చరిత్ర, ఉద్యమ నేపధ్యాన్ని కళ్ళకి కట్టినట్టు పాటని విడుదల చేసిన ప్రసాద్ గారిని అభినందిస్తున్నట్టు లోకేశ్ తెలిపాడు.