అధికార మదంతో జగన్ రెడ్డి రెచ్చిపోతున్నారు – నారా లోకేశ్

Monday, November 2nd, 2020, 06:32:17 PM IST

Lokesh

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సీఎం జగన్ అవినీతిని ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. గురజాల నియోజకవర్గం, చెన్నాయపాలెం మాజీ మార్కెట్ యార్డు డైరెక్టర్ యలమంద నాయక్ జగన్ అవినీతిని ప్రశ్నించినందుకు అక్రమంగా అరెస్ట్ చేశారని అన్నారు.

అయితే ఈ రాక్షస పాలనలో ప్రజల తరపున గళం వినిపిస్తే జైలుకి పంపుతా అంటూ అధికార మదంతో రెచ్చిపోతున్నారు జగన్ రెడ్డి అని సీరియస్ అయ్యారు. దళితులను దండిస్తూ, గిరిజనులను వేధిస్తున్న జగన్ అండ్ గ్యాంగ్ కి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని, నాయక్ గారిపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకుని వెంటనే ఆయనను విడుదల చెయ్యాలని డిమాండ్ చేశారు.