జగన్ ఆ వ్యాధితో బాధపడుతున్నాడు.. నారా లోకేశ్ కామెంట్స్..!

Saturday, October 3rd, 2020, 02:38:28 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. టీడీపీ నేత సబ్బంహరి ఇంటిని కూల్చే కుట్రపై మీడియాతో మాట్లాడిన లోకేశ్ జగన్‌ యాంటీసోషల్ పర్సనాలిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నారని, విధ్వంసం ఈ వ్యాధి ప్రధాన లక్షణమని ఎద్దేవా చేశారు.

అయితే వైసీపీ ప్రభుత్వ తప్పుడు విధానాలను ఎండగడుతున్నారన్న అక్కసుతోనే నోటీసు కూడా ఇవ్వకుండా సబ్బంహరి ఇంటిని కూల్చే కుట్ర చేశారని ఆరోపణలు చేశారు. ఉన్నత విలువలతో రాజకీయాల్లో ఉన్న సబ్బంహరిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడడం జగన మరింత దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ప్రశ్నిస్తే చంపేస్తాం, విమర్శిస్తే కూల్చేస్తాం అంటూ జగన్‌ తనలో ఉన్న సైకో మనస్తత్వాన్ని ప్రజలకు పరిచయం చేస్తున్నారని, విధ్వంసంతో ప్రజాగ్రహాన్ని అణిచివేయడం నియంతలకు సాధ్యం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని అన్నారు.