జగన్ విద్వేష వికేంద్రీకరణకు బ్రాండ్ అంబాసిడర్ – నారా లోకేశ్

Tuesday, August 11th, 2020, 02:16:02 PM IST

Jagan_Lokesh

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు గారు అభివృద్ధి వికేంద్రీకరణకు కేర్ అఫ్ అడ్రస్ అయితే, జగన్ గారు విద్వేష వికేంద్రీకరణకు బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు. టీడీపీ హయాంలో పారిశ్రామికరంగాన్ని పరుగులు పెట్టించడం ద్వారా అభివృద్ధి వికేంద్రీకరణ ఫలాలు అన్ని జిల్లాలకు ఎలా అందాయో వైకాపా ప్రభుత్వమే పూసగుచ్చినట్టు బయటపెట్టిందని అన్నారు.

ఐదేళ్ల టీడీపీ పాలనలో 39,450 పరిశ్రమలు వచ్చాయని, వాటి ద్వారా 5,13,351 ఉద్యోగాలు, ఐటీ శాఖ ద్వారా 30,428 ఉద్యోగాలు, అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్న 137 కంపెనీల ద్వారా 2,78,586 ఉద్యోగాలు రాబోతున్నాయి అని వైకాపా ప్రభుత్వం బల్ల గుద్ది మరీ చెబుతోందని, 14 నెలల జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రానికి గుడ్ బై చెప్పిన కంపెనీలే తప్ప వచ్చిన ఒక్క కంపెనీ అయినా ఉందా అని ప్రశ్నించారు.