మీ వంశ‌మే మోసానికి ప్ర‌తిరూపం.. జగన్‌పై నారా లోకేశ్ ఘాటు విమర్శలు..!

Wednesday, August 12th, 2020, 05:40:52 PM IST

Nara_Lokesh

ఏపీ సీఎం జగన్ నేడు వైఎస్సార్ చేయూత పథకాన్ని ప్రారంభించారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయాన్ని అందించనున్నారు. ఈ పథకానికి ప్రభుత్వం 4,700 కోట్లు కేటాయించింది. అయితే దీనిపై స్పందించిన నారా లోకేశ్ జగన్ సర్కార్‌పై ఘాటు విమర్శలు గుప్పించారు.

డ్వాక్రా మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాన‌ని పావ‌లా వ‌డ్డీ పేరుతో మీ నాయ‌న ఐదేళ్ల‌లో 268 కోట్లు విదిల్చాడు, నువ్వేమో నెలకు 3000 చొప్పున ఐదేళ్లు ఇస్తామ‌ని స‌గం కోసి నెలకు 1500 లెక్క‌న నాలుగేళ్లకే ప‌రిమితం చేశావని, మీ నాయ‌నది న‌య‌వంచ‌న‌. నీది విశ్వాస‌ఘాతుకం. మీ వంశ‌మే మోసానికి ప్ర‌తిరూపం అని నిరూపించుకున్నావు అని కామెంట్స్ చేశాడు.