ఆ నెంబ‌ర్ టోల్‌ఫ్రీకి పెడితే సింబాలిక్‌గా ఉండేది.. జగన్‌పై లోకేశ్ సెటైర్లు..!

Tuesday, August 25th, 2020, 10:42:20 PM IST


ఏపీలో అవినీతిని పూర్తిగా అంతమొందించాలని, ఎవరైనా అధికారులు అవినీతికి పాల్పడితే వెంటనే చర్యలు తీసుకునేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని సీఎం జగన్ ఆదేశించారు. అంతేకాదు దీనిపై ఫిర్యాదులు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్లు కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనిపై ట్విట్టర్ వేదికగా నారా లోకేశ్ స్పందిస్తూ జగన్ గారూ అవినీతిపై ఫిర్యాదు చేసేందుకు టోల్ ‌ఫ్రీ నెంబ‌ర్‌ 14400 పెట్టారు.

అవినీతి చ‌క్ర‌వ‌ర్తి, క్విడ్‌ప్రోకో కింగ్‌, ప్ర‌జ‌ల‌సొమ్ము 43 వేల కోట్లు కొట్టేసి సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1గా ఉంటూ చంచ‌ల్‌గూడ‌లో 16 నెల‌ల్లో జైలులో ఉన్నందుకు గుర్తుగా మీకిచ్చిన నెంబ‌ర్ 6093 అని ఇదే నెంబర్ అవినీతి పై ఫిర్యాదు చెయ్యడానికి టోల్‌ఫ్రీకి పెడితే సింబాలిక్‌గా ఉండేది అని అన్నారు. మీరు దోచేసిన ప్రజా సొమ్ము ప్రభుత్వ ఖజానాకి జమచేసి, అప్పుడు అవినీతిపై మాట్లాడితే బాగుంటుందని ఒక సారి ఆలోచించండి జగన గారు అని ట్వీట్ చేశారు.