సీఎం జగన్ అలా చేసి ఇతరులకు ఆదర్శంగా నిలవాలి – నారా లోకేష్

Tuesday, September 22nd, 2020, 03:00:52 AM IST

lokesh_jagan
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీరు పై ఇటీవల రఘురామ కృష్ణంరాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారి ను దర్శించుకోవాలి అంటే డిక్లరేషన్ పై సంతకం పెట్టాలి అంటూ సూచనలు చేశారు. అయితే గతం లో కూడా జగన్ మోహన్ రెడ్డి పై ఇదే విషయం లో పలువురు విమర్శలు చేయగా, మరొకసారి తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇతరులు ఏమంటున్నారో అన్న దానితో సంబంధం లేకుండా, బాధ్యత గల ఒక పౌరుడిగా,చట్టాలను అమలు చేయాల్సిన ఒక ముఖ్యమంత్రి గా, మనోభావాలను గౌరవిస్తూ, సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు తానుగా, డిక్లరేషన్ పై సంతకం చేసి స్వామి వారిని దర్శించుకొనీ ఇతరులకు ఆదర్శంగా నిలవాలి అంటూ నారా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అంతేకాక అందుకు సంబంధించిన డిక్లరేషన్ ఫామ్ ను ఫోటో తీసి మరి నారా లోకేష్ పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారం పై పలువురు నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.