చేతులెత్తి వేడుకుంటున్నా కార్మికులు ప్రాణ త్యాగాలు చేసుకోవద్దు – నారా లోకేశ్

Sunday, March 21st, 2021, 03:00:29 AM IST

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు సూసైడ్ నోట్ రాసి అదృశ్యం కావడం కలకలం రేపుతుంది. దీనిపై స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కార్మికులు ప్రాణ త్యాగాలు చేసే నిర్ణయం తీసుకోవద్దని కోరారు. కేసుల మాఫీ కోసం జగన్ రెడ్డి కేంద్ర పెద్దల కాళ్ల మీద పడటం వలనే విశాఖ ఉక్కు కాపాడుకోవడానికి కార్మికులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందని, స్టీల్ ప్లాంట్ ఉద్యోగి శ్రీనివాసరావు గారి సూసైడ్ నోట్ చూస్తే బాధేస్తుందని లోకేశ్ అన్నారు.

అయితే కార్మికులు ప్రాణ త్యాగాలు చేసే నిర్ణయం తీసుకోవద్దని చేతులెత్తి వేడుకుంటున్నానని, తెలుగుదేశం పార్టీ కార్మికులకు అండగా ఉంటుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవడానికి ఏం చేసేందుకైనా టీడీపీ సిద్ధంగా ఉందని, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా మేము పోరాడతాం. ఇప్పటికైనా కార్మిక కుటుంబాల్లో నెలకొన్న ఆందోళనను జగన్ రెడ్డి అర్థం చేసుకొని మౌనం వీడాలని, విశాఖ ఉక్కుని కొట్టేసే ప్రయత్నాన్ని ఆపాలని లోకేశ్ డిమాండ్ చేశారు.