తన్నులు తిని అలా చెప్పడానికి సిగ్గుగా లేదా – నారా లోకేశ్

Saturday, December 19th, 2020, 01:44:00 PM IST

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోలీసుల తీరుపై ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. తన్నులు తిని వైకాపా వాళ్ళతో మసాజ్ చేయించుకున్నాం అని చెప్పడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. పోలీసు శాఖ ఆత్మగౌరవాన్ని జగన్ కాళ్ల దగ్గర తాకట్టుపెట్టకండని, అధికార పార్టీని ప్రసన్నం చేసుకోవడానికి కొంత మంది పోలీసులు పూర్తిగా దిగజారిపోతున్నారని అన్నారు. వైకాపా గూండాల నుండి సాటి పోలీసుల్ని కాపాడుకోలేని వాళ్ళు వాస్తవాలు తెలిసినా కళ్ళకి గంతలు కట్టుకొని ఫ్యాక్ట్ చెక్ అంటూ ఫాల్స్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని విమర్శలు గుప్పించారు.

అయితే పోలీసు గాయపడ్డారు అని మీరే అంటున్నారు. మరి ఎవరి దాడిలో పోలీస్ గాయపడ్డారో చెప్పాలని, ఆయనకి ఆయనే గాయపర్చుకున్నాడా? ఆ వీడియోలు ఎందుకు బయటపెట్టలేదు?బాడీ వార్న్ కెమెరాల వీడియోలు ఎందుకు మాయం అయ్యాయి? గాయపడిన పోలీసుకి అయింట్మెంట్ రాయాల్సింది పోయి జగన్ రెడ్డికి అయింట్మెంట్ పుయ్యడం బాధాకరమని అన్నారు. వైకాపా గూండాల దాడిలోనే పోలీస్ గాయపడ్డారు. వైకాపా నాయకులు పోలీసులపై చేసిన దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు బయటపెట్టే ధైర్యం మీకు ఎలాగో లేదు అందుకే నేను విడుదల చేస్తున్నా అని వీడియోలను రిలీజ్ చేశారు.