ఎన్నికల కమీషన్ ఏం చేస్తోంది…నారా లోకేష్ సీరియస్ కామెంట్స్

Wednesday, March 3rd, 2021, 04:32:56 PM IST

రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అటు అధికార పార్టీ, ఇటు ప్రతి పక్షాలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నాయి. అయితే అధికార పార్టీ వైఖరి పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతి మునిసిపాలిటీ 45 వ వార్డ్ కోసం తెలుగు దేశం పార్టీ తరపున నామినేషన్ వేసిన చంద్రమోహన్ అభ్యర్ధిత్వాన్ని బలపరిచినందుకు తెలుగు దేశం నేత గొల్ల లోకేష్ నాయుడు పై వైసీపీ రౌడీలు దాడిచేసి కొట్టడమే కాకుండా, ఆయన షాపును ధ్వంసం చేశారు అని నారా లోకేష్ అన్నారు.అయితే అందుకు సంబంధించిన వీడియో ను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు లోకేష్.

వైసీపీ దద్దమ్మల్లారా అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో నిలబడి పోటీ చేసే దమ్ము లేని మీరు ఈ బాగోతాలు బయట పడతాయి అనే కదా, చంద్రబాబు గారికి భయపడి ఆయన్ను విమానాశ్రయం లో అడ్డుకున్నది అంటూ నారా లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది అంటూ సూటిగా ప్రశ్నించారు. అయితే నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకి నెటిజన్లు స్పందిస్తున్నారు. వైసీపీ నీ ఏపీ లో ఇక ఎవరూ నమ్మరు అంటూ చెప్పుకొచ్చారు.