జగన్ ఢిల్లీ పర్యటనపై నారా లోకేశ్ ఒపీనియన్ పోల్..!

Wednesday, December 16th, 2020, 04:24:40 PM IST

ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనపై ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఒపినియన్ పోల్ నిర్వహించారు. జగన్ ఢిల్లీ పర్యటన వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటని ప్రశ్నిస్తూ కేసుల మాఫీ కోసమా, బాబాయ్ హత్య కోసమా లేక ప్రత్యేక హోదా తేవడం కోసమా అంటూ మూడు ఆప్షన్లను ఇచ్చాడు. అయితే నారా లోకేశ్ అడిగిన ప్రశ్నకు నెటిజన్లు కూడా ఆసక్తికరమైన సమాధానాలిచ్చారు. కేసుల మాఫీ కోసమని 69 శాతం మంది, హోదా కోసమని 25 శాతం మంది, బాబాయ్‌ హత్య కేసు కోసమేనని 6 శాతం మంది తమ అభిప్రాయాలను తెలిపారు.

ఇది పక్కన పెడితే కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో నిన్న సీఎం జగన్ భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన వీరి భేటీలో వరద సాయం, వ్యవసాయ చట్టాలు, పోలవరం నిధులపై మరియు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించినట్లు సమాచారం. అయితే ఈ భేటీలో సీఎం జగన్‌తో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి కూడా పాల్గొన్నారు.