ఆ అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వండి.. జగన్ సర్కార్‌కు నారా లోకేశ్ డిమాండ్..!

Wednesday, September 2nd, 2020, 12:00:35 AM IST

Jagan_Lokesh
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ ప్రభుత్వానికి సరికొత్త డిమాండ్ వినిపించారు. గ్రామ/వార్డు సచివాలయ సిబ్బంది నోటిఫికేషన్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తై మెరిట్ లిస్ట్ లో వున్న అభ్యర్థులకు పోస్టింగులు ఇవ్వాలని ఇదివరకే జగన్ గారికి దీనిపై లేఖ కూడా రాశానని, అనేక సార్లు డిమాండ్ చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు.

అంతేకాదు ఈ రోజు ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి వ్యతిరేకంగా విజయవాడలో ఆందోళన చేపట్టిన అభ్యర్థులను, మద్దత్తు తెలిపిన టీడీపీ, ఏఐటీయూసీ నాయకులను అక్రమంగా అరెస్ట్ చెయ్యడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపాడు. అయితే ఇకనైనా ప్రభుత్వం స్పందించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయిన వారికి వెంటనే నియామక పత్రాలు అందచేయాలని డిమాండ్ వినిపించారు.