నారాయ‌ణ పోస్టుకు చిన‌బాబు ఎస‌రు!!

Friday, September 23rd, 2016, 12:33:21 AM IST

nara-lokesh1
టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి లోకేష్ కు మంత్రి ప‌ద‌వి అప్ప‌గించాల‌ని చంద్ర‌బాబు ఎప్ప‌టి నుంచో ప్లాన్ లో ఉన్నాడు. ఇప్పుడు అది ఫైన‌ల్‌ కాబోతుంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే చిన‌బాబు జిల్లా స్థాయిలో జ‌రుగుతోన్న తెలుగు త‌మ్ముళ్ల వివాదాల‌ను సున్నితంగా ప‌రిష్క‌రించ‌డం లో స‌క్సెస్ అయ్యాడు. రాజ‌కీయ వివాదాల ప‌రిష్కారంలో నీరు బాగా వంట ప‌ట్టింది. అందుకే ఇక నేరుగా మంత్రి గా రంగంలోకి దించితే త‌డాకా చూపిస్తాడ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. త్వ‌ర‌లో ఏపీలో మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జ‌ర‌గ‌నుంది. అయితే అంత‌కంటే.. ద‌స‌రా లోపే చిన‌బాబు ప‌ట్టం కట్టాల‌ని పార్టీ భావిస్తోంది.

లోకేష్‌ జాత‌కం ప్ర‌కారం అక్టోబ‌ర్ 1వ తేదిన మంచి ముహూర్తం ఉంద‌ని పండిత‌లు సూచించ‌డంతో ఆ రోజే ప‌ద‌విని ద‌ఖ‌లు ప‌రిచే ఛాన్సుంద‌ని అంటున్నారు. దీనిలో భాగంగా ఏపీలో కీల‌క శాఖ అయిన మున్సిప‌ల్ శాఖ‌ను అప్ప‌గించే యోచ‌న‌లో ఉన్న‌ట్లు స‌మాచారం. ప్ర‌స్తుతం ఆ శాఖ బాధ్య‌త‌ల‌ను నారాయ‌ణ నిర్వ‌ర్తిస్తున్నారు. అమ‌రావ‌తి నిర్మాణానికి ఈ శాఖ కీల‌కం కాబ‌ట్టి లోకేష్ వంటి యంగ్ నాయ‌కుడిని అప్ప‌గిస్తే ప‌నులు వేగంగా జ‌రుగుతాయ‌ని పార్టీ శ్రేణులు సూచిస్తున్నార‌ట‌. మొత్తానికి నారాయ‌ణ పోస్టుకు లోకేష్ బాగానే ఎస‌రు పెడుతున్నాడ‌ని ప్ర‌తిప‌క్షాలు విసుర్లు విసురుతున్నాయి.