ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నిస్తే చంపేస్తాడు నయా నియంత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 25 వేల కోట్ల రూపాయల లిక్కర్ మాఫియా ను ఎండగట్టినందుకు చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్ ను చంపేశారు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఇప్పుడు ప్రకాశం జిల్లా బెస్తవారపేట మండలం, శింగర పల్లె గ్రామంలో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదు అంటూ స్థానిక ఎమ్మెల్యే ను ప్రశ్నించిన వెంగయ్యను చంపేశారు అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి ప్రభుత్వ హత్యలే అంటూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చెత్త పాలనను ప్రశ్నించిన వారిని చంపి ఆత్మహత్య చేసుకున్నారు అంటూ కేసు క్లోజ్ చేయడం జగన్ రెడ్డి ఫ్యాక్షన్ రాజకీయానికి నిదర్శనం అంటూ నారా లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. వైకాపా రౌడీ మూకలను తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయి అంటూ చెప్పుకొచ్చారు. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం లో హాట్ టాపిక్ గా మారాయి.
ప్రశ్నిస్తే చంపేస్తాడు నయా నియంత @ysjagan.25 వేల కోట్ల లిక్కర్ మాఫియాని ఎండగట్టినందుకు చిత్తూరు జిల్లాలో ఆటో డ్రైవర్ ఓం ప్రతాప్ ని చంపేశారు.ఇప్పుడు ప్రకాశం జిల్లా,బెస్తవారపేట మండలం,శింగరపల్లె గ్రామంలో అభివృద్ధి పనులు ఎందుకు చేయడం లేదంటూ..(1/2) pic.twitter.com/SxyQjbfriQ
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) January 19, 2021