సీఎం జగన్‌కి అల్టీమేట్ కౌంటర్ ఇచ్చిన నారా లోకేశ్..!

Thursday, August 27th, 2020, 08:17:48 PM IST

lokesh_jagan

ఏపీ సీఎం జగన్‌కి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అల్టీమేట్ కౌంటర్ ఇచ్చారు. అమ‌రావ‌తిని చంపేందుకు త్వ‌రగా కోర్టులో విచార‌ణ పూర్తిచేయాల‌ని అడుగుతున్న మీరు, లక్ష కోట్ల ప్ర‌జాధ‌నం దోచేసిన 11 కేసుల విచార‌ణ త్వ‌ర‌గా పూర్త‌య్యేందుకు స‌హ‌క‌రించాలి. కోర్టుకి వెళ్లకుండా ఉండేందుకు విచారణ ఆలస్యం అయ్యేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.

అయితే కోవిడ్ వైర‌స్ భ‌యం వ‌ల్ల ఓ సారి, కోర్టుకి రావాలంటే 60 ల‌క్ష‌ల‌వుతుందని మ‌రోసారి, గ‌తంలో ప్ర‌తిప‌క్ష‌నేత‌గా ఉన్నాను రాలేన‌ని, ఇప్పుడు ప్ర‌భుత్వాధినేత‌గా ఉన్నాను కోర్టుకి హాజ‌రు కాకుండా మిన‌హాయింపునివ్వాల‌ని అడుగుతున్నారు. రకరకాల పిటిషన్లు వేస్తూ 10 ఏళ్ళు గడిపేశారని అన్నారు. 29 వేల మంది రైతుల స‌మ‌స్య కేసు రోజుల్లో తేలిపోవాలా? మీ ల‌క్ష‌ కోట్ల దోపిడీ కేసేమో ఏళ్లుగా సాగాలా అని ప్రశ్నించారు.