ప్రమాణం చేసే దమ్ముందా.. సీఎం జగన్‌కు నారా లోకేశ్ సవాల్..!

Thursday, April 8th, 2021, 01:37:08 AM IST


ఏపీ సీఎం జగన్‌కు టీడీపీ జాతీయ ప్రధానా కార్యదర్శి నారా లోకేశ్ ఓ సవాల్ విసిరారు. తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా నేడు సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో ఉపఎన్నిక ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న లోకేశ్ సైకో రెడ్డి పాలనలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు వివరించినట్టు చెప్పుకొచ్చాడు. అంతేకాదు వైఎస్.వివేకానంద రెడ్డి గారి హత్యతో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని ఆ వెంకన్న సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి నేను సిద్ధం. ఈ నెల 14 న తిరుపతి వస్తున్న జగన్ రెడ్డి ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు వివేకా గారి హత్యతో సంబంధం లేదని ప్రమాణం చేసే దమ్మూ, ధైర్యం ఉందా అంటూ లోకేశ్ సవాల్ విసిరారు.