నామినేష‌న్ వేస్తే చంపేశారు, గెలిస్తే చంపేశారు.. జగన్ సర్కార్‌పై లోకేశ్ ఫైర్..!

Thursday, February 25th, 2021, 03:00:23 AM IST

Nara-Lokesh
తూర్పుగోదావ‌రి జిల్లా నడిపూడి 11వ వార్డు బూత్ ఏజెంట్‍ రవిశంకర్ ఆత్మహత్యపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రవిశంకర్ ది ఆత్మ‌హ‌త్య కాదు, ముమ్మాటికీ జగన్ అధికార ఆధిప‌త్య అహంకారంతో చేసిన దారుణ‌ హ‌త్య‌ అని అన్నారు. నామినేష‌న్ వేస్తే చంపేశారు. గెలిస్తే చంపేశారు. చివ‌రికి పంచాయ‌తీ ఎన్నిక‌ల ఏజెంట్ల‌నూ వెంటాడి వేధించి ఆత్మ‌హ‌త్య చేసుకునేలా చేశారని అన్నారు. అధికారం అండ‌తో ఎన్నిక‌లు అయ్యాక కూడా అరాచ‌కాలు సృష్టిస్తోన్న వైసీపీపై చ‌ర్య‌లు తీసుకోవ‌డంలో ఎస్ఈసీ విఫ‌ల‌మైందని, ఏజెంట్ల‌నే చంపేస్తుంటే, ఇక గెలిచిన అభ్య‌ర్థుల ప్రాణాల‌కు దిక్కెవ‌రు అని ప్రశ్నించారు.