గాడిదకేం తెలుస్తుంది గంథం వాసన…దేవాదాయ శాఖ మంత్రి పై నారా లోకేష్ ఫైర్

Sunday, January 3rd, 2021, 09:25:06 AM IST

Nara_Lokesh

అశోక్ గజపతి రాజు ను ధర్మకర్త గా తొలగిస్తూ వైసీపీ తీసుకున్న నిర్ణయం పట్ల టీడీపీ బగ్గుమంటోంది. అయితే వైసీపీ నేత, దేవాదాయ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలకు గానూ నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గాడిదకేం తెలుస్తుంది గంథం వాసన అంటూ మంత్రి పై విమర్శలు చేశారు. అశోక్ గజపతి రాజు వంశీకులు కట్టించిన ఆలయాల ముందు కొబ్బరి చిప్పలు కొట్టేసే దొంగకు మహారాజు ఔన్నత్యం ఎలా తెలుస్తుంది అంటూ నారా లోకేష్ అన్నారు. నీతికి బూతుకి తేడా తెలియని వాడి నోటి నుండి అంతకంటే మంచి భాష ఎలా వస్తుంది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలను సైతం నారా లోకేష్ వీడియో రూపం లో పోస్ట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే రామతీర్థం ఆలయం కట్టించిన అశోక్ గజపతి రాజు పూర్వీకులు, ఆలయ ధూపదీప నైవేద్యాలకి తమ ఏలుబడిలోనీ 12 గ్రామాలను కేటాయించారు అని నారా లోకేష్ కొనియాడారు. విజయనగరం సంస్థానంలో 105 దేవాలయాల నిర్మాణం , పోషణా పూసపాటి వంశీకుల దే అని అయినా తెలుసా దేవాదాయ శాఖ మంత్రి అంటూ సూటిగా ప్రశ్నించారు. మాన్సాస్ ట్రస్ట్ ద్వారా 14 కి పైగా విద్యా సంస్థలకు మహారాజ పోషకులు పూసపాటి వంశీకులే కంత్రి మంత్రి, తెలుసుకో అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు నారా లోకేష్. నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు సైతం మద్దతు తెలుపుతూ వైసీపీ తీరు పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు.