గతేడాది ఏపిపిఎస్సీ పరీక్షల నిర్వహణలో భారీ అక్రమాలు జరిగాయి – నారా లోకేష్

Tuesday, May 4th, 2021, 11:54:29 AM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో అధికార పార్టీ వైసీపీ పై మరొకసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఏపీపిఎస్సీ పరీక్షలు పారదర్శకం గా నిర్వహించకుంటే మరో పోరాటం తప్పదు అంటూ నారా లోకేష్ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు. అయితే గతేడాది జరిగిన ఏపీపిఎస్సీ పరీక్షల నిర్వహణ లో భారీ అక్రమాలు జరిగాయి అని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ఈ విషయాలు తన దృష్టికి వచ్చాయి అని వివరించారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకు పడ్డారు. అయితే ఈ సారి రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నారా లోకేష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.