నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా క్షమించడు జగన్ – నారా లోకేష్

Monday, May 3rd, 2021, 01:30:44 PM IST


తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరొకసారి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై, జగన్ పాలనా విధానం పై నిప్పులు చెరిగారు. ప్రభుత్వం ఆధిపత్య రాజకీయాల పై చూపించే శ్రద్ధ, ప్రజలకు ఆక్సిజన్ అందించడం పై చూపెడితే హిందూపురం ఆసుపత్రి లో 8 మంది చనిపోయే వారు కాదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రతి పక్ష నేతల్ని కక్ష గట్టి అరెస్ట్ చేయించేందుకు వాడుతున్న యంత్రాంగాన్ని ప్రజల ప్రాణాలు కాపాడేందుకు వాడితే కర్నూలు ఆసుపత్రి లో ఆరుగురు ఊపిరి ఆగిపోయేది కాదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు నారా లోకేష్. అధికారులు, పోలీసులు, వాలంటీర్లను వాడుకొని తిరుపతి ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించుకోవడం పై పెట్టిన శ్రద్ధ ప్రాణవాయువు అందించే దానిపై పేట్టి ఉంటే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి లో 10 మంది చనిపోయే వారు కాదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నీ ఏదో ఒక అక్రమ కేసు పెట్టీ అరెస్ట్ చేయించాలని చేస్తున్న ప్రయత్నాలు, ఉత్తరాంధ్ర లోని ఆసుపత్రులలో మెరుగైన సౌకర్యాల కల్పన పై పెట్టీ ఉంటే విజయ నగరం ప్రభుత్వ ఆసుపత్రి లో ఆక్సిజన్ అందక కోవిడ్ పేషంట్లు చనిపోయి ఉండేవారు కాదు అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రజలకు రక్షగా ఉంటావనీ ఎన్నుకుంటే ప్రతి పక్ష పార్టీ పై కక్ష తీర్చుకుంటున్నావు అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న నిన్ను నువ్వు నమ్ముకున్న దేవుడు కూడా క్షమించడు వైఎస్ జగన్ అంటూ నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే హిందూపురం ఘటన పై విచారణ జరిపి బాధ్యులు పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు నారా లోకేష్. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి అని, ప్రభుత్వ హత్యలకు జగన్ రెడ్డి బాధ్యత వహించాలి అంటూ నారా లోకేష్ అన్నారు.