పబ్లిసిటీ పిచ్చి తప్ప మహిళల రక్షణ మీకు పట్టదా?

Monday, November 2nd, 2020, 03:01:48 PM IST

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోమారు అధికార పార్టీ తీరు పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లేని చట్టాల పేర్లు చెబుతూ ఎంతకాలం మహిళలను మోసం చేస్తారు సీఎం జగన్ గారు అంటూ సూటిగా ప్రశ్నించారు నారా లోకేష్. పబ్లిసిటీ పిచ్చి తప్ప మహిళల రక్షణ మీకు పట్టదా అంటూ నిలదీశారు. మీ నిర్లక్ష్య ధోరణి కి ఇంకెంత మంది బలై పోవాలి అని, రాష్ట్రం లో మహిళలకి రక్షణ కల్పించడం లో వైసీపీ ఘోరంగా విఫలం అయింది అంటూ దారుణ వ్యాఖ్యలు చేశారు.

అయితే NCRB గణాంకాల ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రోజుకి మూడు అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి అని, మృగాళ్లు రెచ్చిపోయి చిన్నారులను చిదిమేస్తున్నారు అని, విశాఖ లో బంగారు భవిష్యత్ ఉన్న వరలక్ష్మి ను మృగాడ బలి తీసుకున్నాడు అని నారా లోకేష్ అన్నారు. అయితే ఈ ఘటనలో బాధిత కుటుంబానికి న్యాయం జరగక ముందే, చిత్తూరు జిల్లాలో, పెద్ద పంజాని మండలం, రాయల్ పేట లో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు అని, గాలి మాటలు చెప్పడం ఆపి, మహిళలకు రక్షణ ఇప్పించండి అంటూ మండిపడ్డారు.