సున్నా వడ్డీ ఋణాలలో రైతులకు వెళ్ళింది సున్నా – నారా లోకేష్

Friday, October 30th, 2020, 02:24:49 PM IST

తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తూ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉన్నపుడు రైతులకు చేసిన విషయాన్ని వివరిస్తూనే, వైసీపీ అధికారం లో ఉండగా జగన్ రైతులకు ఎటువంటి సహాయం చేస్తున్నారు అనే విషయం పై నారా లోకేష్ ఘాటు విమర్శలు చేశారు.

అయితే తెలుగు దేశం పార్టీ అధికారం లో ఉన్నప్పుడు వ్యవసాయ రంగం వృద్ది రేటు 11 శాతంగా ఉన్న విషయాన్ని వెల్లడించారు. అప్పుడు భారతదేశంలోనే నంబర్ వన్ గా ఉన్నాం అని తెలిపారు. అయితే ఇప్పుడు అది సున్నా గా ఉన్నది అని విమర్శించారు. అంతేకాక రైతులకు సున్నా వడ్డీ రుణాలు గురించి సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆనాడు శాసన సభ లో సున్నా వడ్డీ గురించి చర్చలు జరిగాయి అని, 3,500 కోట్ల రూపాయలు సున్నా వడ్డీ కి ఇవ్వాలి అని జగన్ తెలిపారు. కానీ నెక్స్ట్ బడ్జెట్ లో జగన్ 100 కోట్ల రూపాయలు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆ వంద కోట్లల్లో రైతులకు ఏదైనా వెళ్లిందా అంటే అది కూడా సున్నా అని, సున్నా వడ్డిలో రైతులకు వెళ్ళింది సున్నా అంటూ నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.