క్వారంటైన్ కేంద్రాలు వ్యాధి తగ్గించడానికా? ప్రజలని చంపడానికా?

Thursday, September 24th, 2020, 06:26:16 PM IST

Nara Lokesh

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉందని చెప్పాలి. భారీగా నమోదు అవుతున్న ఈ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల కారణం గా, మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. అయితే తాజాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో జరుగుతున్నా కరోనా పరిణామాల పై తెలుగు దేశం పార్టీ కి చెందిన నేత నారా లోకేష్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కరోనా వైరస్ పెద్ద విషయం కాదు అను ఆరున్నర లక్షల మంది కరోనా భారిన పడటానికి కారణం అయ్యారు అంటూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పై ఘాటు విమర్శలు చేశారు.

బ్లీచింగ్ పౌడర్ చల్లితే చచ్చిపోతుంది అని, పారా సిట్మాల్ వేసుకొంటే తగ్గిపోతుంది అని చెప్పి 5,506 మంది చావుకు కారణం అయ్యారు సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయినా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడటం లేదు అని నారా లోకేష్ పేర్కొన్నారు. తమను జంతువుల కంటే హీనం గా చూస్తున్నారు అని, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం క్వారంటైన్ కేంద్రం లో కరోనా వైరస్ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అని పేర్కొన్నారు. కనీస సౌకర్యాలు లేవు, తినడానికి తిండి పెట్టరు, క్వరంటైన్ కేంద్రాలు వ్యాధి తగ్గించడాని కా లేకపోతే ప్రజలను చంపడానికా అంటూ నారా లోకేష్ సూటిగా ప్రశ్నించారు.